Saturday, February 18, 2012

"బ్లాగు పుస్తకం" పరిచయం కూడా ఆదివారం నాడే

ప్రముఖ బ్లాగర్లు సుజాత, రెహ్మాన్ గార్లు రచించిన బ్లాగు పుస్తకం పరిచయ కార్యక్రమం ఈ ఆదివారం (19 న) హైదరాబాద్ లోని మధురానగర్ లో ఏర్పాటు చేశారు. ఇది ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకూ జరుగుతుందని నిర్వాహకులు పంపిన ఆహ్వానపత్రంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ ఆహ్వానపత్రాన్ని చూడండి.

రెహ్మాన్ గారిని కలిసిన గుర్తు లేదు కానీ సుజాత గారు నేను బ్లాగు మొదలుపెట్టినప్పడు పరిచయం అయ్యారు. బ్లాగు పరంగా సాంకేతిక సమస్యలు వచ్చినా, కొన్ని అంశాల విషయంలో నైతికపరమైన సందేహాలు తలెత్తినా ఒక మంచి సోదరీమణిలాగా ఆదుకున్నారు. వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ రహ్మాన్ గారికి, సుజాత గారికి అభినందనలు. ఉదయం రాజగోపాల్ గారి సరదాకి పుస్తకావిష్కరణ కార్యక్రమం చూసుకుని మధ్యాహ్నానికి ఈ ప్రోగ్రాంకు హాజరుకావాలని నేను అనుకుంటున్నాను. వేణువు గారు వస్తారని ఆశిస్తున్నాను. అటు వెళ్లే ఒక నలుగురైదుగురికి ఖైరతాబాద్ నుంచి వాహన సౌకర్యం కల్పించబడును. కేరాఫ్ అడ్రస్...ఆల్ఫా హోటల్, ఖైదరాబాద్ చౌరస్తా.

3 comments:

malli said...

పుస్తకం నేను చదివాను.బ్లాగ్స్ గురించిన చాలా సమాచారాన్ని చాలా సులువైన భాషలో చెప్పారు.కొన్ని ఆంగ్ల సాంకేతిక పదాలని తెలుగు చేసే ప్రయత్నం కూడా రచయితలు చేసారు.సుజాత గారికీ రెహ్మాన్ గారికీ అభినందనలు.
మల్లీశ్వరి

ddtv said...

I spent more than a decade in HYD before coming to US but never heard about this address... :D

కేరాఫ్ అడ్రస్...ఆల్ఫా హోటల్, (ఖైదరాబాద్ చౌరస్తా)

SREE said...

Ram garu namaste...
mee blog regularga follow avutuntaanu. appudappudu konni views/opinions share chesukovalani anipistuntundi. Tel. script typing problem. SURAVARA vari Keyboard chooshaanu. Naalaanti vaariki adi vupayogapadutundaaa.... pl. ans.

--Sakshi TVlo konni marpulu jarigaayi (programs). Alage, Sakshi TVni NDTV vaaru kontunnarani vinnanu.. nijamenaa....
--- SREE----------------------------

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి