Saturday, January 12, 2013

అక్బర్ భాయ్...ఏ సబ్ బేకార్ బాత్ హై....


అక్బర్ భాయ్....

రజాకార్ల దౌర్జన్యాలకు బలైన గడ్డ మీద పుట్టాను నేను. ముష్కర మూకల అఘాయిత్యాలకు భయపడి మా వాళ్ళు కొందరు పొరుగు ప్రాంతాలకు పారిపోతే...ఖాసిం రజ్వీ దండు మా ఇంటిని చుట్టముట్టింది. అప్పుడు మా కుటుంబాన్ని రక్షించింది మా ఇంటి పక్కన ఉన్న ఒక ముస్లిం భాయీ సాబ్. హిందూ ముస్లిం తేడా లేకుండా మేము బతికాం, బతుకుతున్నాం. ముస్లిం ల బాధ మా బాధ అనుకున్నాం, అనుకుంటున్నాం. 


ఆనందం, బాధ పంచుకోవడం లో మాకు మతం అడ్డం రాలేదు. నువ్వు పీర్లు ఎత్తావో  లేదో...మా పల్లె జనం ఇప్పటికీ పీర్ల పండగ ను పెద్ద పండగగా భావిస్తారు. దర్గాలకు వెళ్లి తాయెత్తులు కట్టించుకోవడం...పిల్లలకు ముస్లిం పేర్లు పెట్టుకోవడం మాకు కొత్త కాదు. నేను హిందువును...అని మా ఊళ్లలో ప్రజలు ఒక్కసారైనా తమ నోటితో అని ఉండరు. ఇంటి ముందున్న చర్చి, పొరుగునున్న మసీదు, ఊళ్ళో వున్న ఆలయం మాకు ఒకటే. దేవుడూ ఒకటే. మా ఐక్యతకు గట్టి చరిత్ర ఉంది. 

అలాంటిది...ఎంత  మాట అన్నావ్ భాయీ సాబ్. ఎంత దారుణంగా మాట్లాడావ్. నువ్వు వాడిన ఒకొక్క మాట...ఒక్కో ఈటె లాగా మా గుండెల్ని తాకింది. గుండె బద్దలయ్యింది. మతాన్ని వాడుకోవాలనుకునే తొగాడియా లను కడిగేసాము. మోడీలకు మొట్టికాయ వేసాము. మా ముస్లిం సోదరులకు తీవ్రవాదులు అన్న ముద్ర పడడాన్ని సహించలేక పోయాం.   
నీ ప్రసంగం విన్నాక మొట్ట మొదటి సారి మత పరమైన భావన బలంగా కలిగింది. హిందువుల మనస్సులు గాయపడ్డాయి. కొందరు కుహనా లౌకిక వాదులు...నీ పిచ్చి ప్రసంగాన్ని, కొందరు హిందూ మతోన్మాద శక్తుల ప్రేలాపనలను పోలుస్తున్నారు. రక్తపాతం సృష్టిస్తామని అన్న ఏ పిచ్చి వెధవా ఏమీ చేయలేదు. ఎందుకంటే అది సాధ్యం కాదు. మేము...సాధారణం ప్రజలం...మతం ప్రాతిపదికన యుద్ధాలు జరగాలని అనుకోవడం లేదు. మీ పిచ్చి ప్రేలాపనలతో, బేకార్ మాటలతో రక్తం ఉడికే వాళ్ళు నిజమైన ముస్లిం లు కాదు, హిందువులు కాదు, భారతీయులు కాదు. 

రక్తపాతం తో ఏమీ జరగదు భాయీ సాబ్. అదే నిజమైతే...ఇప్పటికీ అక్కడ నిజాం ఉండే వాడు. వాడు, వాడి మతం మమ్మల్ని నాశనం చేసినా....మేము మిన్నకున్నాం. మొఘలులు ఇతరులు ఇక్కడి ఆలయాల మీద జరిపిన ఉన్మాద దాడుల సాక్ష్యాలు ఇప్పటికీ మమ్మల్ని వెక్కిరిస్తున్నా...జరిగినవి మరిచిపోయి భాయీ...భాయీ...అని మేము బతుకుతున్నాం. అవన్నీ...మతి లేని రాజుల తెలివితక్కువ పని అని మేము జీర్ణించుకుని బతుకుతున్నాం. 

పోలీసులు పదిహేను నిమిషాలు మిన్నకుంటే...ముస్లింల తడాఖా చూపిద్దామని అన్నావ్ కదా. ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే వ్యక్తులు, ఆలయాలను, శిల్పాలను కించపరిచావ్. అనరాని మాటలు అన్నా...మాకు ముస్లిం మతం మీద, మతస్థుల మీద కోపం రాదు. నీ మీదనే ముందు కోపం వచ్చింది, ఆ తర్వాత జాలి కలుగుతున్నది. నిన్న శుక్రవారం నాడు నమాజ్ అయ్యాక హైదరాబాద్ లో ముష్కర మూకలు పోలీసులు, మీడియాపై రెచ్చిపోవడం ఏమి పని చెప్పు? బాగా చదువుకున్న అసదుద్దీన్ నిన్ను సమర్ధిస్తూ మాట్లాడడం చూస్తుంటే పరిస్థితి చేయిదాటిందన్న బాధ కలుగుతున్నది.  ముస్లిం ఓట్ల కోసం నువ్వు మాట్లాడిన మాట...హిందూ మత ఛాందసవాదులను ఏకం చేసింది. ప్రతీకారం తో రగులుతున్న భజరంగ్ దళ్ ముఠా రంగంలోకి దిగిందని వస్తున్న వార్తలు మాలాంటి సాధారణ ప్రజలకు భీతి కలిగిస్తున్నాయి. 

అక్బర్ భాయ్...ఇప్పటికే...తెలంగాణా...ఆంధ్రా అని నేతలు మమ్మల్ను రెండుగా చీల్చారు. కుల పోరాటాల వల్ల ఇప్పటికే మేము లోపల లోపల విడిపోయి బైటికి ఐక్యంగా కనిపిస్తున్నాం. కుల దాడులు పెరుగుతున్నాయి. కరంటు బిల్లులు పెరుగుతున్నాయి. అభివృద్ధి కుంటు పడింది. కులం, మతాలతో సంబంధం లేకుండా...మేము అందరం రోజు ఎట్ట గడుస్తుందా...అని ఆలోచిస్తూ చస్తూ బతుకుతున్నాం. ఎవడి బాధ వాడికి వుంది. దానికి అదనంగా...నీ రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు గానీ, సంఘ పరివార్ గానీ మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి. మాకు కొంత శాంతిని ఇవ్వండి. 

అందుకోసం...ప్రస్తుతానికి మనందరికీ మతి స్థిమితం ప్రసాదించాలని, నువ్వు జరిగినదానికి కనీసం పశ్చాత్తాపం ప్రకటించేలా నీలో పరివర్తన కలగాలని అల్లాను, శ్రీ రామ్ ను ప్రార్ధిస్తూ ముగిస్తాను.
జై హింద్..
జై భారత్...

8 comments:

krshnrao said...

స్వతహాగా ముస్లిం మతస్తులు త్యాగానికి వెనుకాడరు...ఇక అది మతం కోసమైతే చెప్పనే అవసరం లేదు...హిందువులో ఆ గుణాన్ని చూడలేము...కనుకనే కొన్ని వందల యేళ్ళుగా ప్రతి అడ్డమైన జాతులకి బానిసలుగా బతుకుతున్నాము...వాళ్ళని వేడుకుంటూ...శాంతి ముసుగులో మన చేతకానితనాన్ని కప్పెట్టుకుంటూ..!!

Praveen Mandangi said...

అక్బరుద్దీన్ ఉవాచ: ఒకవేళ ముస్లింలు దేశాన్ని వదిలి వెళ్ళిపోతే ఎర్రకోటనీ, తాజ్ మహల్‌నీ, గోల్కొండనీ తమ వెంట తీసుకెళ్ళిపోతారు. హిందువులకి పురాతన రామాలయాలు & ఎల్లోరా గుహలలోని నగ్న విగ్రహాలు తప్ప ఏమీ మిగలవు.
సత్యం: నీ మతానికే చెందిన మక్బూల్ ఫిదా హుస్సేన్ అనే చిత్రకారుడు నగ్న చిత్రాలు వేసినప్పుడు నగ్నత్వం ఇస్లాం మతానికి వ్యతిరేకమనే విషయం గుర్తురాలేదా?

అక్బరుద్దీన్ ఉవాచ: కౌశల్య రాముణ్ణి కనడానికి ఎన్ని చోట్ల తిరిగింది?
సత్యం: ఇస్లామిక్ చరిత్రకారుల లెక్క ప్రకారం ముహమ్మద్ ప్రవక్తకి ఉంపుడుగత్తెలు ఎంత మంది? మగవాడు అనేక మంది స్త్రీలని ఉంచుకుంటే తప్పు కాదు కానీ ఆడది మాత్రం ఒకడి కంటే ఎక్కువ మంది దగ్గరకి వెళ్ళకూడదంటావు, అంతే కదా.

అక్బరుద్దీన్ ఉవాచ: బాబ్రీ మస్జీద్ కూల్చకపోతే ముంబై బాంబు పేలుళ్ళు జరిగేవి కాదు.
సత్యం: నువ్వు MLAవి అయ్యుండి కన్నుకి కన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి అనే హింసావాద సూత్రాన్ని నమ్ముతున్నావని ఇక్కడ అర్థం కావడం లేదా?

అక్బరుద్దీన్ ఉవాచ: కసబ్ పాకిస్తానీయుడు కాబట్టే అతన్ని ఉరి తీశారు, నరేంద్ర మోడీ భారతీయుడు కాబట్టే అతన్ని ప్రాసిక్యూట్ కూడా చెయ్యలేదు.
సత్యం: నరేంద్ర మోడీని ప్రాసిక్యూట్ చెయ్యకపోవడం తప్పే కానీ కసబ్‌ని ఉరితియ్యకూడదని చెప్పడానికి ఇంకొక తప్పుని జస్టిఫికేషన్‌గా చూపిస్తావా?

Unknown said...

A very good piece on Akbaruddin reflecting the mindset of Razakar Rizvi.But I fail to understand why the clergy,mullahs and religious heads of Islam,educationists,politicians and other elite muslim community have been silent without condemning Akbaruddin outrightly for his poisonous comments on hindus?

JP.

Unknown said...

Akbaruddin's lawyer is a hindu.Akbaruddin was saved by hindu doctors in care hospital when he was attacked by his opponents.He married a christian.Then why this madness of anti hindu mindset with criminality?

K V Ramana said...

It is unfortunate that Togadia is being roped into the controversy each time people talk about hate speeches. I am not supporting what Togadia has been saying. But, please remember that Akbaruddin is an elected representative and he has taken an oath to abide by the constitution. Togadia is just an individual and he can be irresponsible till the law catches up with him.
The Owaisis never expected that they will go behind bars. They continued their hooliganism with the support of some more elected representatives who are in the habit of even thrashing up collectors and other public servants.
After the arrest, the junior Owaisi has gone back on all that he had uttered. He has even allegedly disowned the speech. Imagine even if one individual in that meeting had taken Akbaruddin seriously and went on to do what the leader was directing at, what would these successors of Rizvi do? One Muslim friend of mine, who has been going for prayers five times a day had an interesting comment. When I asked him if he was praying for early release of Akbaruddin. He said, "I will definitely pray. But I will pray for his detention for one full decade. Why should he go to London for treatment when he has his own hospital. That clearly shows that in the name of hospital they are indulging in cheap politics for votes while they get quality treatment abroad." I think there is a point in this.

katta jayaprakash said...

I appreciate the views of your friend.If every one in the muslim community thinks on the lines of this gentleman can Owaisis survive in the society? Owaisis are very sad at the hanging of Kasab!What a love for nation and martyrs of the Mumbai killings by Kasab.
JP.

Ramesh said...

ఎంత బాగ చెప్పరు, సెఖ్యులరిజం అంటె ఇదెనేమొ? or చేతకానితనం అని కొందరు మిత్రులు... whatever it is, we love to live in peace and try to drag lives without issues. This is a genuine article from most of the Indians prospective... that’s way we are still most ethnically diverse countries in the world.

Unknown said...

Akbaduddin murdabad. Seemandhrulni champi Telangana Thalliki Raktha Tharpanam Chesthaananna Ale Narendra zindabad. Idee mana prajaswamyam.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి