Tuesday, May 20, 2014

ఇద్దరు ఉద్దండ యోధుల నిష్క్రమణం...

ఈ మే నెలలో... సార్వత్రిక ఎన్నికల అనంతరం సంభవించిన ఒక రెండు పరిణామాలు నిశిత పరిశీలకులకు మనసు చివుక్కుమనిపిస్తాయి. నిజానికి ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయమైనా... ఇక్కడ పరిణామం అనే పదం వాడడానికి ఒక కారణం ఉంది. శక్తులైన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య పలు పోలికలున్నాయి. అందివచ్చిన అధ్బుత అవకాశాలను చేతబుచ్చుకుని ఒక వెలుగు వెలిగి.... చరమాంకంలో వెక్కిరిస్తున్న అపజయాన్ని దిగమింగుకుని తలవంచుకుని వెళ్ళిపోతున్నారు.  
వారిద్దరూ...తలపండిన యోధులు. ఎంతో సౌమ్యులు. మంచివారిగా పేరున్న వారు. చిత్తశుద్ధితో తమ పని తాము చేసుకు పోయే వారు. వృత్తి నిబద్ధత లో తిరుగులేని వారు. విద్యావంతులు, సంస్కారవంతులు. బాగా పనిచేయాలన్న తపన ఉంది. కష్టపడే తత్త్వం వారిది. ఇద్దరికీ డాక్టరేట్ ఉంది.


ఇద్దరికీ మంచి అవకాశాలు బంగారు పళ్ళెంలో అంది వచ్చాయి. ఇంటికెళ్ళి పోదామనుకుంటూ ఉండగానే... మన్మోహన్ ను పిలిచి మరీ సోనియా గాంధీ ప్రధాని పదవి ఇచ్చారు... అత్యున్నత లక్ష్యంతో. సరిగ్గా అలాగే...వేమూరి రాధాకృష్ణ కొలువులో కొనసాగుతున్న తరుణంలో కొండుభట్ల రామచంద్ర మూర్తి గారికి కపిల్ గ్రూప్ అధిపతి వామన రావు గారు ఏరి కోరి మరీ హెచ్ ఎం-టీవీ పగ్గాలు అందించారు... సదుద్దేశంతో. పీవీ నరసింహా రావు అమలు చేసిన సంస్కరణలకు ఊపు ఇవ్వాలని అనుకున్నారు సింగ్ గారు. వినూత్నత్వంతో నీళ్ళను నీళ్ళలా... పాలను పాల లా బుల్లి తెరమీద చూపాలనుకున్నారు మూర్తి గారు.  
అయితే... పదేళ్ళు పాలించి...దారుణమైన ఆర్ధిక వ్యవస్థ దివాలాకోరుతనానికి  కారణమై... చివరకు పగ్గాలు గుజరాత్ అల్లర్లకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ కి అప్పగించి మన్మోహన్ ఇప్పటికే నిష్క్రమించారు. ఆరేళ్ళ పాటు... హెచ్ ఎం టీవీ కి, తర్వాత ది హన్స్ ఇండియా అనే పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించి...కపిల్ గ్రూప్ మింగలేని కక్కలేని నష్టాలకు బాధ్యుడన్న అపవాదు మూటగట్టుకుని... పగ్గాలను... తెలుగు టెలివిజన్ లో కలెక్షన్ కింగ్ గా పేరున్న రాజశేఖర్ కు అప్పగించి నిష్క్రమిస్తున్నారు.... రామచంద్ర మూర్తి గారు. బుధవారం నాడు అయన కోసం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇది నిజంగా ఇద్దరు యోధుల మహాభినిష్క్రమణం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత అద్భుతమైన వ్యక్తులైనా...వారిద్దరూ చివరకు ఒక శిధిల సామ్రాజ్యాన్ని వదిలి నిష్క్రమిస్తుస్తుండడం విధి విచిత్రం. తమ చేతిలో లేని వివిధ అంశాలు ఈ దుస్థితికి కారణమైనా....మనసు గాయపరిచే ఒక పీడకల వారిని వెంటాడబోతుండడం తప్పించుకోలేని కఠోర వాస్తవం.  

ఏది ఏమైనా....భారత రాజకీయ చరిత్రలో సింగు గారికి, ఆంధ్ర ప్రదేశ్ జర్నలిజం చరిత్రలో మూర్తి గారికి ప్రత్యేక అధ్యాయాలు ఉంటాయన్నది నగ్నసత్యం. దొంగలు, ధూర్తులు అసలే మసలే ఈ లోకంలో...మన్మోహన్, మూర్తి గారి లాంటి అత్యుత్తమ సౌమ్యులు రాజకీయ పరంగా, ఆర్ధిక పరంగా (ఆ వరసలో) క్లిక్ కాకపోయినా...ఆయా రంగాల్లో వారి ముద్ర శాశ్వతంగా ఉండి తీరుతుంది. వారిని పొగిడి బుట్టలో వేసుకుని పలు ప్రయోజనాలు పొందిన వారు, పదవివశాత్తూ పాటించక తప్పని వారి మౌనం వల్ల, ఆడక తప్పని వారి అబద్ధాల వల్ల భంగపడిన వాళ్ళు...ఈ మహోన్నత వ్యక్తులను తప్పక స్మరించుకుంటారు. అవకాశాలు అందివచ్చినా... పరిస్థితులు అనుకూలించకపోతే ఏమీ చేయలేమనడానికి ఈ ఇద్దరు సజీవ సాక్ష్యంగా ఉంటారు. వీరిద్దరి శేష జీవితాలు ఆరోగ్యంగా, అద్భుతంగా సాగాలని.... అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ రాజశేఖర్ రాణించి పరిస్థితులు చక్కబర్చాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఫోర్. 

(నోట్: ఇందులో 'కలెక్షన్ కింగ్' అన్న మాటను దురర్ధంలో తీసుకోవద్దని మనవి. ప్రేక్షకుల అభిరుచులు స్పష్టంగా తెలిసి, అదే సమయంలో వ్యాపార ప్రకటనలు రాబట్టడంలో అద్భుతమైన చిట్కాలు ఎరిగిన జర్నలిస్టులలో రాజశేఖర్ ముందుంటారు. కులం, గోత్రం కలవకపోయినా...గాడ్ ఫాదర్స్ లేకపోయినా... తెలుగు జర్నలిజం లో తనకంటూ ఒక సంచలనమైన అధ్యాయం ఏర్పాటు చేసుకుని చిన్న వయసులో పెద్ద పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఆధ్వర్యంలో హెచ్ ఎం టీవీ, ది హన్స్ ఇండియా కచ్చితంగా గాడిలో పడతాయని ఈ బ్లాగ్ బృందం గట్టిగా విశ్వసిస్తోంది.) 

6 comments:

katta jayaprakash said...

It is a pity that Ramachandra Murthy who is a senior,most talented and expereinced journalist is leaving hmtv.He had done great service to flouride affected districts by organising many programmes from grass root level and brought out the plight of the victims of flourosis.He was the first person to start feed back from viewers through theerpari programme.hmtv is the most unfortunate ne to forgo him.I feel before choosing any organisation in media Murthy should put forward his terms and conditions otherwise he has to roll like a stone without any purpose.
JP.

సుజాత వేల్పూరి said...

ఎక్కడైనా అపజయాలకు ఒకరే బాధ్యులు కావడం ఎన్నడూ జరగదు. కానీ ఎవరో ఒకరి వైపు వేలెత్తి చూపి గుండె పై చేయి వేసుకుని నిద్ర పోవడం మనిషికి హాయి. ఆ కారణం చేతనే ఈ ఇద్దరికీ అలాటి అపవాదు దక్కిందేమో

అయితే, మేథో శక్తిని మన్మోహన్ వృధా చేసినంతగా మూర్తి గారు చేయలేదు. సౌమ్యత్వం కూడా కొన్ని సార్లు పనికిరాని క్వాలిటీ కమర్షియల్ ప్రపంచంలో

మూర్తిగారి జీవితం చక్కగా సాగాలని కోరుకుంటూ

Unknown said...

పదప్రయోగాలు చేసేటప్పుడు -కొంచెం గమనించాలి
నిష్ర్కామణం .సూటబుల్ గా లేదు

అలాగే ఇక్కడ ఇద్దరీకీ పోలిక లేదు...

News Updates said...

murthy garu team ni sariga build up cheyadam lo success kaleka poyaru

virinchi said...

ఏఎ హంసని భరించిన వామన రావు గారు మహానుభావుదు.ఈ హంస కూదా పాలు నీల్లు వెరు చెసింది, కాని పాలని వదిలెసి నీల్లు వుంచుకుంది.

katti said...

akkada soniya.. ikkada virahat..

vaastavaniki.. iddaru.. diggajale... kaani yemi chestaru .?! morakari chestilo keelu bommaluga maaraaru.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి