Tuesday, January 6, 2015

చిగురుపాటి ఛానెల్ కు నేమాని బృందం టాటా


డాక్టర్ చిగురుపాటి జయరామ్ స్థాపించిన ఎక్స్ ప్రెస్ టీవీ కి సీనియర్ ఎడిటర్ నేమాని భాస్కర్ రాజీనామా చేయడం, ఆయనకు మద్దతుగా ఒక 21  మంది జర్నలిస్టులు వైదొలగడం గత 48 గంటల్లో జరిగాయి. ఒక ఎడిటర్ కోసం ఇంతమంది వైదొలగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం.
టీవీ-9 నుంచి దినేష్ ఆకుల ను సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (ఎడిటోరియల్ అండ్ ఆపరేషన్స్)  గా నియమించినప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న భాస్కర్... వై. రాజశేఖర్ లాగా నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ కి వెళ్లిపోతారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది ఉంది. అయితే ఇంతమంది తో కూడిన నేమాని భాస్కర్ బృందాన్ని  తీసుకునే పరిస్థితి చౌదరి గారి చానెల్ లో లేదు. కాబట్టి భాస్కర్... త్వరలో రానున్న ఒక ఛానెల్ లోకి వెళతారని భావిస్తున్నారు. 

పోతూపోతూ నేమాని భాస్కర్... చిగురుపాటికి ఒక ఆరు పేజీల మెయిల్ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాటలకు, చేతలకు  పొంతన లేకపోవడం, దినేష్ ను తెచ్చే తప్పుడు తనను సంప్రదించకపోవడం.... వంటి అంశాలు అందులో పేర్కొన్నారు. ఆ లేఖ యథాతథంగా ప్రచురించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ఇకపోతే... హెచ్-ఎం టీవీ లో అనేక మంది ఉద్యోగాలు పీకేసిన అపవాదు మూటగట్టుకుని... చివరకు మళ్ళీ ఎన్-టీవీ కి వచ్చిన వై.రాజశేఖర్ తన పని తాను చేసుకుపోతున్నారు. "వచ్చాడు... ఉద్యోగాలు పీకాడు... ఉడాయించాడు. దీనివల్ల ఏమి సాధించాడు? మా కుటుంబాల ఉసురు తగలకపోదు," అని ఒక బాధిత జర్నలిస్టు ఆవేదనతో అన్నారు  

నోట్: ఈ ఫోటో నేమాని భాస్కర్ గారి ఫేస్ బుక్ పేజీ నుంచి దిగుమతి చేసుకున్నాం.

1 comments:

Unknown said...

* నమ్మివచ్చిన ఉద్యోగులను నట్టేట ముంచిన సాక్షి టివి యాజమాన్యం....
* సొంత జిల్లాలోనూ ఉద్యోగులపై కనికరం చూపని వై.ఎస్.జగన్.....
* కారు డ్రైవర్లకు కూడా జీతం ఇవ్వలేని స్థితిలో సాక్షి టివి ఉందంట...!
* ఆనాడు ఎక్కువ జీతం ఎర చూపి...నేడు అదే సాకుతో సాగనంపుతున్న సాక్షి టివి యాజమాన్యం...
* పని రాని వారికి అందలం, లక్షల్లో జీతాలు.. కష్టపడి పనిచేసే వారిని మాత్రం బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసిన సాక్షి టివి యాజమాన్యం...
* తడి గుడ్డతో ఉద్యోగుల గొంతు కోసిన చందంగా సాక్షి టివి చేష్టలు...
మనసుండి, ఆలోచించే ప్రతి ఒక్కరికి ముందు చూపు, ముందు జాగ్రత్త కోసం సూచిస్తున్న ఈ సమాచారాన్ని గ్రహించాలని కోరుతున్నాం...
సాక్షి టివి సంస్థ చేసిన ఈ దారుణం, సాక్షి ని నమ్ముకుని నట్టేటపాలైన సాక్షి టివి ఉద్యోగులు వారి కుటుంబాలు.. చిన్న స్థాయి ఉద్యోగులను తీసేసి నడి రోడ్డుకు లాగి విసిరేసిన సాక్షి యాజమాన్యం. ఆనాడు ఎవరి మానాన వారు ఎక్కడో ఏదో ఒక ఛానల్లో వారి స్థాయికి తగిన ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్న వారిని పిలిచి మరీ దారుణంగా ఈ రోజు ఉద్యోగం నుండి తీసేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మీ ఉద్యోగాలు ఎప్పటికి ఎక్కడికీ పోవని మభ్యపెట్టి ఆనాడు మురిపెపు మాటలతో మాయ చేసి ఈనాడు నట్టేట ముంచారు సాక్షి టివి యాజమాన్యం. బాబు వచ్చాడు జాబు పోయింది అనే నినాదంతో చంద్రబాబునాయుడుపై మండిపడుతూ ప్రజల్లో తిరుగుతున్న సాక్షి సంస్థ వ్యవస్థాపకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన సంస్థలో పని చేస్తున్న కార్మికులను మాత్రం అతి దారుణంగా ఉద్యోగం నుండి తొలగించి రోడ్డుకు విసిరి పడేస్తున్నాడు. మాటతప్పని వంశం.. మడమ తిప్పని నేత అంటూ గొప్పలు చెప్పుకునే వై.ఎస్. వారసుడు ఈ విధంగా తన సంస్థలో పని చేస్తున్న కార్మికులను నిర్ధాక్ష్యణంగా తీసేస్తున్నాడు. మరి భవిష్యత్ లో వై.ఎస్.జగన్ మాటలను ప్రజలు ఏ విధంగా విశ్వసించాలో.. ఆ విషయం వై.ఎస్.జగన్ గారినే చెప్పమని కోరుచున్నాము. ఆనాడు సాక్షి సంస్థ స్థాపించినప్పుడు అన్నం పెడతాను రండి అని పిలిచి ఈ రోజు నోటి దగ్గర కూడును లాగేస్తున్నాడు. ఇలాంటి ఊసరవెళ్లి నైజం కలిగిన నాయకుడిని భవిష్యత్ లో ప్రజలు ఎంత వరకు నమ్మవచ్చో నట్టేట మునిగిన సాక్షి ఉద్యోగులే ఒక ఉదాహరణ. అంటే వై.ఎస్.జగన్ భవిష్యత్ లో వచ్చే ఎన్నికలలో అయినా అధికారం కోసం ప్రజలను కూడా ఆటలో అరటి పండులా వాడుకుని నట్టేట ముంచినా ఆశ్చర్యపోనవసరంలేదు. వై.ఎస్.జగన్ సారధ్యంలో నడుస్తున్న కంపెనీలలో పని చేస్తున్న ప్రస్తుత ఉద్యోగులను కూడా భవిష్యత్ లో ఇలాగే రోడ్డున పడేసే అవకాశం కూడా లేకపోలేదు..ఈ రోజు తన సాక్షి సంస్థ ఒక్క చిన్న కుటుంబంలాంటిది, ఇలాంటి చిన్న కుటుంబాన్నే కాపాడుకోలేక కార్మికులను మోసం చేస్తున్నాడంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ విధంగా ప్రజలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వఉద్యోగులను పరిపాలించగలడు అనే సందేహం వ్యక్తమవుతోంది. కావున సాక్షి సంస్థ ఉద్యోగల పట్ల వై.ఎస్.జగన్ వ్యవహరించిన తీరుపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి, ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే సాక్షి టివి భాదితులకు మద్దతు పలికి, పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత సామాజీక, స్వఛ్చంద,రాజకీయ,రాజకీయేతర, మీడియా ప్రతినిధులపై ఉంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి